పరిమళించే పుష్పాలు
పరిమళించే పుష్పాలు
తను పుట్టినప్పుడు నాటిన మొక్క
చిన్నప్పటి నుంచీ తను కోస్తున్న పూలు
వాటి పరిమళం
చిన్న కుక్క పిల్ల వెంట పరుగెత్తడం
బిందెల్లో నీళ్ళు మోయడం
అమ్మమ్మతో జడలు అల్లించుకోవడం
మళ్లీ తెల్లవారేక
పూలు కోయడం
ఆటలు
పాటలు
దోస్తులు
అన్నీ అక్కడే
ఇప్పుడు
మూడు ముళ్ల తర్వాత
తను కొంగున కట్టుకుని
ఏమేం తీసుకెళ్లగలదు
అమ్మనా అమ్మమ్మనా
జడ రిబ్బన్లనా
పూల మొక్క శాఖను తీసుకెళ్ళింది
వెళ్ళిన చోట కూడా
ఆ పుష్పాలు పరిమళించాలని..
