Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Abstract

4.5  

Eevani Ravisankara Sarma

Abstract

ప్రేమా ! ఓ ప్రేమా !

ప్రేమా ! ఓ ప్రేమా !

1 min
442


ప్రేమా ! ప్రేమా ! ప్రేమా ! ఓ ప్రేమా !

నీవో అద్భుత భావనవా !

మాటల్లో చెప్పలేని అర్థమే నీదా ?

మనిషి అడుగడుగులోని

చెఱకుగడ తియ్యదనం నీవేనా !


మమ్మల్ని మేము చూసుకునే

చూపుల్లో దాగేవా ?

తెల్లనిమల్లెల నవ్వులనే మాలో

మురిపెంగా పూయించేవా !


ఒకరితో మరొకరిని కలిపే

ఊహల సీతాకోకచిలుకవా ?

రంగురంగులలో కనిపించి

మా మనసులనే అలరించేవా !


కలలో సముద్రపు అలలా

ఇరువురిని దరిచేర్చేవా ?

కమ్మని ఊసులనే పంచి

గట్టి నమ్మకాన్నే కలిగించేవా !


మాలోని ప్రేమను తెలిపే

అక్షరలక్షల సొబగువా ?

మా జీవితాల్లో వసంతాన్నే

మళ్ళీమళ్ళీ తీసుకొచ్చేవా !



Rate this content
Log in

Similar telugu poem from Abstract