Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

EEVANI RAVISANKARA SARMA

Inspirational

4.5  

EEVANI RAVISANKARA SARMA

Inspirational

ఆడుతూ పాడుతూ ..!

ఆడుతూ పాడుతూ ..!

1 min
249


అందరు తమకుతాము

జీవితంలో తగిన స్వేచ్ఛను కోరెదరు .

స్వీయసాధనలో ఉందని

అధిక సంతృప్తి , అలా చేసెదరు !

ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా

ఇంటి నిర్వహణలో

మహిళలు విశేషసేవలకు కర్తలు .

అందుకు అందుకుందురు పొగడ్తలు !

మంచి సామాజిక వ్యవస్థలోనే

ఆడపిల్లగా పుట్టాక

చదువుసంధ్యలకు ఉన్నత అవకాశం ;

కోరికలు గుర్రాలైతేనే అసలు

అవలీలలుగా అందుకోగలం ఆకాశం !

ప్రేమగా వైవాహికజీవితంలో అడుగిడి

తల్లిగా ఆమెది మరోజన్మ .

ఆ లోగిలో ప్రాణప్రతిష్ఠకు పాటుపడి

మమతలకు మారుపేరయ్యే అమ్మ !

అసాధారణ ఓర్పు , నేర్పులతో

సమాజనిర్మాణంలోనూ

ప్రశంసలను ప్రోగేసే దివ్యపథం ;

గమ్యంవైపు పయనించే ప్రగతిరథం !

ఆడుతూ పాడుతూ ధరించే

చిరునవ్వులే ఆమెకు వన్నెతెచ్చే సింగారం ,

మధురస్మృతులు మెరిసే బంగారం !




Rate this content
Log in

Similar telugu poem from Inspirational