ప్రేమ వాన
ప్రేమ వాన
ముంచెత్తే ప్రేమవాన..కురుస్తూనె ఉంటుంది..!
జ్ఞాపకాల నిలువుకోత..జరుగుతూనె ఉంటుంది..!
చెప్పుకోను వల్లకాని..బాధలేవొ ఎందుకోయ్..
తీపిఆశ పరుగులేవొ..వండుతూనె ఉంటుంది..!
పాడుతున్న నిజవసంత..కోకిలయే మానసం..
ఓపలేని విరహాగ్నిని..మింగుతూనె ఉంటుంది..!
చిత్రమైన అనుభవాల..తోటలోన జీవితం..
సాక్షిలాగ బ్రతకుతీరు..నేర్పుతూనె ఉంటుంది..!
మరణాలు విరామాలు..తెలియకనే అలజడులు..
చైతన్యపు ఉలి శిలలను..చెక్కుతూనె ఉంటుంది..!
లెక్కలేని విశ్వాలను..దాచుకున్న ఓ కణం..
అంతరంగ జ్ఞాననిధికి..నడుపుతూనె ఉంటుంది..!
