ప్రేమ కధ
ప్రేమ కధ
అప్పట్లో బి.యన్.రెడ్డి అంతవాడు
తను తీసిన ప్రేమ కథను విజయనగరం
బాట పట్టించాడు
ఆ అమర కావ్యమే మల్లీశ్వరి
ఏడ తానున్నాడొ బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల వో మేఘమాల
ప్రతి తెలుగువాడి గుండెల్లో
నిలచిపోయిన ప్రేమ కథ ...
ఇప్పుడు బండి నారాయణ స్వామి
తన నవల కడపటి యుద్ధం లోని
గుండెలను పిండేసే ప్రేమ కథను
విజయనగరం బాట పట్టించాడు
అప్పుడు ,ఇప్పుడు విజయనగరం
జాడ తప్పలేదు ...
ఎంతో గొప్ప ప్రేమ కథను
తన గుండెలోని ప్రేమనంతా రంగరించి
అలివేలు,శ్రీనివాసుల ప్రేమకథగా
ఆవిష్కరించాడు స్వామి
నిజంగా తాను ప్రేమజీవి కాకుంటే
అలా ఎలా రాయగలరు ...
చదివే పాఠకుని మనసు ముాగపోతుంది..
అవి హంపణ్ణ సైనిక శిక్షణకని
భానుకోటకు పంపబడినప్పుడు
అడవిలో కట్టెలు కొట్టేపనికి వినియెాగించినప్పుడు
అప్పుడే చెట్టుకు పుాసిన
ఎర్రమందారాల్లా వున్న
అలివేలు, శ్రీనివాసులు పరిచయమవుతారు
ఎనిమిదేళ్ళ పిల్ల అలివేలు
చిదిమి దీపం పెట్టుకోవచ్చునంట
పసిమి ఛాయతో చర్మంలో స్వర్ణం
ప్రవహిస్తున్నట్లుంటుందంట
ఆ స్వర్ణమే ఆ పిల్లల్లో
పోను పోనుా ప్రేమగా మారి
స్వర్ణాన్ని పుటంపెట్టినట్టు కాగిపోతుంది...
పంచాయతీకి వచ్చిన సామంతుని కన్ను
అలివేలుపై పడుతుంది
పడకుాడదమ్మా పాపాయిమీాద
పాపిష్టి కళ్ళు ,కామిష్టి కళ్ళు
అన్నట్లుగానే పడతాయి భానుకోట
సామంత రాజు నాగలమడక నాగఫణి శర్మ
కనులు...
అలివేలమ్మ తల్లి సంజీవమ్మ
తండ్రి బసిరెడ్డిలు సామంతుని
సొత్తుకు, వేసిన ఎత్తుకు లొంగిపోతారు
కాలం ఏదయినా ధనముాల మిదం
జగత్తు కదా ...
సమర్తయిన అలివేలును
రాణివాసానికి పంపే ఏర్పాట్లు
ఆ లేతమనసుల
అలివేలు, శ్రీనివాసుల
గుండెల్లో గాట్లు...
పల్లకీ ఎక్కబోయిన అలివేలుకు
శ్రీనివాసులు ఎక్కడా కనపడడు
అలివేలు మానసంలో
అంతా భ్రాంతియేనా
జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేన, మిగిలింది చింతేనా
అనుకుంటుంది ....
అలివేలు కంట గంగ
కనిపించని శ్రీనివాసుని కంట యమున
ఒక్కసారే కలిసి ఉప్పొంగాయి
ఎవరికి పట్టింది ఆ ముాగమనసుల రోదన...
రాజులకు సంపదలకేమి కొదవ
అట్లే పెళ్ళాలకేమి కొరత
అలివేలుకు పదునెనిమిదిమంది సవతులు
స్త్రీలను భోగవస్తువుగా భావించే
ఆనాటి సమాజంలో స్త్రీలు
కామాగ్నిలో సమిధలే ...
అందుకు ప్రత్యక్షసాక్షం
శోభనం రోజున అలివేలును
దిశమెులతో నిలబెట్టి
రాక్షసానందంపొందే భర్త
నాగలమడక నాగఫణి శర్మ
రాజాంతఃపురంలో అలివేలు
ఒక నగ్న బొమ్మ ....
ఇక్కడ శ్రీనివాసులలో
విషాదం ఏరులై పారింది
మేలుకోవలసిన తరుణంలో
మేలుకోలేకపోయిన తన అశక్తత
దాని పర్యవసానంగా శోకం
గుండెల్లో ఏరులై పారింది ...
అలివేలుకేమెా ప్రతి రాత్రి విషరాత్రి
నరరుాప రాక్షస మగనికి
శరీరం అర్పించినప్పుడెల్లా
ఆమె రగిలిపోయే అగ్ని కణం...
అంతరంగం బావకోసం
ఆక్రోశిస్తుంది ..వెతుకులాడుకుంటుంది
నీవులేని బ్రతుకును నెుాస్తుా జీవించలేను
ముగిసిందని మరణించలేను ..అనుకుంటుంది...
శ్రీనివాసులు పిచ్చివాడయి
హంపి పుర వీధులలో తిరుగుతుంటాడు
అంతఃపురాల్లో వున్న అలివేలు
ఒక్కసారయినా కనపడకపోతుందా అని
హంపికొచ్చి ఆరునెలలయినా
అలివేలు కనపడదు
వీధుల్లో పిచ్చివాడయి తిరుగుతున్న
శ్రీనివాసులపై దయతలచి
ఎవరయినా ఏమయినా పెడితే తింటుంటాడు ..
ప్రేమ కథలన్నీ కంచికి చేరితే
ప్రేమకు విలువ ఏముంటుందనేమెా
ఆ ప్రేమ విలువ ప్రపంచానికి చెప్పడానికేమెా
శ్రీనివాసులు శ్రీరామనవమి రోజున
ఊరేగింపులో తేరుకింద తల పెట్టి
తనువు చాలిస్తాడు...
సరిగా అదేసమయంలో
అలివేలు దిగుడుబావిలో పడి
ప్రాణాలు తీసుకుంటుంది ...
పసి వయసులో విరిసిన ప్రేమ
లోకపు విలువలకు తట్టుకోలేక
తల్లడిల్లుతుా ఆ ప్రేమికులిరువురుా
ప్రాణాలు తీసుకోవడం మనసు మెలిపెడుతుంది
ఇది జ్వలించే జీవితాల కథనం ...

