STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Tragedy Action

4  

Thorlapati Raju(రాజ్)

Drama Tragedy Action

పగిలిన హృదయాలు 💔

పగిలిన హృదయాలు 💔

1 min
374

క్రొత్త క్రొత్త ఊహలతో

ఊసులు నిండిన కలలతో

కలలు వీడని కళ్ళతో

కళ్ళను నడిపించే కాళ్ళతో

అడుగుపెట్టాను అందమైన బంధం లో


అందమైన బంధంలో బందీనై

ప్రేమ బందీగా కలకాలం ఉండాలనుకున్న

అంతలోనే అనుకోని సంఘటన

సంగమించాక తెలుసుకున్నా సగం వేరేవరోనని

ఆ సగాన్ని సంఘంలో పెట్టలేక

సంఘం కోసం..నే సగంగా ఉండలేక

సగం చచ్చిన శవం లా..

పగిలిన హృదయం అయింది నా బతుకు


పగిలిన హృదయాలు..మేమంతా

అయినోడే.. పగవాడయ్యాడు

పగటి రేడే..పగ బట్టాడు

రవి కిరణాలతో వికసించిన కమలాలను చూసి

తెల్లని మల్లెనైన నేను తెలవారిన సంది

జాము రేయి వరకు పగటి రెడు పక్కకు చేరి

మసై పోతిని

పగది (పోలిక) యెప్పుడూ పగులు ఇచ్చునని 

తెలియనైతిని


పగిరె(పైరు) తడిపే పగిరి(ఏరు)..

పగబట్టి పగడలాడుతుంటే (పాచిక)

హృదయాలు పగులక.. పరవశం బొందునా?


మేమంతా... పగిలిన హృదయాలం

హిమాలయాల్లో ఉంటున్న..

గుండె మంట చల్లర్చే హిమం లేకపోయే

శీతాకాలంలో ఉన్ననూ

తనువున మంటలు చెలరేగెను


కోయిల గానం గుండెను కోస్తుంది

నెమలి నాట్యం పేగుల్ని నులిపెడుతుంది

వేణువు..వేదన రాగం పాడుతుంది

సితార తంత్రులు గొంతును చుట్టేస్తున్నాయి


యే రాగం విన్నా...హృదయ రోధన

యే గీతం పాడుకున్న హృదయ వేదన

వెక్కి వెక్కి గుక్కపట్టి ఏడుస్తున్నా


ఈ పగిలిన హృదయాలకు

బాధే బతుకుగా..వేదనే ఊపిరిగా

సాగుతూ...సాగుతూ..


        ....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Drama