పెంపకం
పెంపకం
పాలబుగ్గల పసివాడు పొత్తిళ్ళలో
ఎనలేని ఆనందం తల్లికళ్ళలో
తండ్రిమదిలో ఉప్పొంగినగర్వం
తాతా-నానమ్మలకు బాబేసర్వం
"బాబే మనజీవన సర్వస్వం అమలా
పెంచాలిమనం అంతా గర్వపడేలా"
ఆనంద్ భార్యతో అన్నాడు ధృఢంగా
"ఏలోటూ లేకుండా పంచుదాం ప్రేమని
చదివించి ఇద్దాం మంచిభవిష్యత్తుని"
మురిపెంగా చూసింది ఆతల్లి బాబుని
"అంతటితో అయిపోతుందా మనపని
నేర్పాలి బాబుకి చక్కని తీరైననడకని
తండ్రిగా నేర్పుతా సరైననడవడికని
తల్లిగా పెద్దలను గౌరవించడం నేర్పాలి
అందరితో కలిసిమెలిసి ఉండేలా చూడాలి
ఆడపిల్లలతో అన్నదమ్మునిలా మసలాలని
ఎవరినీ కించపరిచేలా మాటలాడరాదని
పిల్లలకు ఇల్లు మొదటిబడి కావాలి
తల్లిదండ్రులు తొలిగురువులు కావాలి
ఇవియన్నీ మనం నేర్పగలిగిననాడు
మనబాబు కాగలడు మంచిపౌరుడు
పుత్రోత్సాహము కలుగును ఆనాడు
బాబు అందరిమెప్పును పొందిననాడు"
ఆతల్లి ప్రేమతో కనులనీరు నింపుకొని
"ఎంతచక్కగా వివరించారు పెంపకాన్ని
మీరుచెప్పిన బాటలోనే నడుద్దాము
బాబుని చక్కగా తీర్చిదిద్దుదాము
అందరి మన్ననలు పొందగలిగేలా
చక్కనిజీవితాన్ని గడపగలిగేలా"
ఇద్దరూ బాబును ప్రేమగాముద్దించారు
పెద్దలువారిని శతాయువని దీవించారు