పెళ్ళి !
పెళ్ళి !
మానవ వికాసాన్ని ఒక పద్ధతి
చేస్తూ ఉంది ప్రభావితం ;
ప్రపంచవ్యాప్తంగా ఆకర్షితురాలైంది
తీవ్రంగా ప్రతి మతం .
మనుషుల మనుగడకు
పరిచయం అనే బంధం కారణం ;
పరస్పర అవగాహన వారి
స్వప్నమనే నాగరికతకు ప్రాణం .
స్త్రీపురుషుల మధ్య ప్రేమ
అభివృద్ధి చేస్తోంది సంతతిని ;
సమాజం భావిస్తోంది ఒంటరితనం
భరించలేని కష్టమేనని .
అందుకే జంటలకు ప్రత్యేకత
కల్పిస్తోంది పెళ్ళి అనే ఆచారం ;
వారిని కలిపి నడిపిస్తోంది
సహకారం అనే సాధారణ విధానం .
కట్టుబాట్లు ఉన్నా వ్యక్తిగత
ప్రాధాన్యతలకే అసలు చోటు ;
అపోహలు , ఆకర్షణలతో
తప్పనిసరైన వైఫల్యమనే పోటు .
స్వావలంబన , భద్రతతో
సుసంపన్నం మానవ జీవితాలు ;
ప్రేమాభిమానాల పునరుజ్జీవనానికి
తపించాలి తరతరాలు .
