పేరడీ - మెడ్లీ : కవీశ్వర్ 17.0
పేరడీ - మెడ్లీ : కవీశ్వర్ 17.0


భావితనూ మార్చెదా - ఓటునూ వేసెదా
పాలన చేసేదా - నీతి ని పెంచెదా , వనరులు పెంచెదా
అయినా ఓటు నీవు వేయు - దేశపు సిరులు పెంచుముందూ |
ఓటేసి వచ్చిందీ ఓట రమ్మీ - తానాదర్శంగా నిలిచిందీ ఓటరమ్మీ
డబ్బులే వద్దంటూ - ఆశలే లేవంటూ ఓటేసివచ్చింది ఓటరమ్మీ |
ఓటువేసుకొని పెళ్లి చేసుకొని - ఇంటి ని నేను నిలపాలీ దేశము నేనూ చూడాలీ
అందరు సుఖముగ ఉండాలి - దేశము సిరినీ పొందాలి |
ఓటువేసి ఓటువిలువ తెలుసుకో - దేశ ప్రజలసం వృద్ధినీ కోరుకో
నిన్ను చూసి జనులంతా పొగడగా - దేశమాత భక్తినే పెంచుకో |
వచన సూచన: కుళ్ళు రాజకీయాన్ని కడిగేయి - పారదర్శక పాలన అందించేయ్ -
దీనికి ఓటు ఆయుధాన్ని వెయ్ - దేశాభివృద్ధికి దారి చూపేయ్ |