పేరడీ - కవితా గీతం - 2
పేరడీ - కవితా గీతం - 2
పల్లవి : ఓ సఖి సఖీ - నా సఖి సఖీ ..2
ఏల ఈ తిప్పలూ - జీవితం లో ముప్పులూ
ఇదో లోకం అదో కాలం - ప్లాస్టిక్ భూతం తగ్గేదెలాగా పోయేదెలాగ?
రోజు దాన్నే వాడితే - చెదలు రావు వీటికే కలిగే ఘోర కాలుష్య కాసారం \\ ఓ సఖి.. సఖీ నా సఖీ .. సఖీ \\
ఓ సఖా సఖా .... నా సఖా సఖా .. 2
చాల మూగ జీవులూ - పొందే నేడు చావులూ
నుండే క్లిష్ట దారులూ - కొట్టే కంపు వాసనలూ
వాడి వేసి - ఇలలో చూసి చావుకొచ్చే దిలాగా \\ ఓ స ఖా.. సఖా నా సఖా సఖా \\
క్రొత్త క్రొత్త బ్యాగులూ - రంగు రంగు లేబులూ
తేలికైన పాత్రలూ - జీవితాన రాతలూ
బరువేస్తే తెగిపోయే - తగిలిస్తే చిరిగేసే
ఏల వాడె నేను రోజూ ఈ సమయానా ? \\ ఓ సఖీ .. సఖీ నా సఖీ .. సఖీ \\
గాలి లోన కలవదు - నీటిలోనే నానదూ
మట్టిలోనే మెట్టదూ - ఇదియే సత్యమూ
కట్టెలాగా మారదూ - చెత్తలోన పేరునూ
వట్టిగానె పెరుగునూ - ఇదియే సత్యమూ
వద్దంటే వాడుతావు - లేదంటే ఊరుకోవూ
నారా- పీచు బ్యాగులే వాడుదామా నే \\ ఓ సఖా .. సఖా నా సఖా .. సఖా \\
