STORYMIRROR

Midhun babu

Inspirational Others

3  

Midhun babu

Inspirational Others

పాతాళం ఆదాయం పడిపోతే

పాతాళం ఆదాయం పడిపోతే

1 min
176

పాతాళం ఆదాయం పడిపోతే..


ఎందుకో మాట పలకాలని మనసుకు లేదు 

మౌనపు నిద్రలో సేద తీరాలని ఉంది

కూని రాగాల కంఠంలో ఆకలికి నలిగిపోతుంటే

మాట్లాడే పదాలకు ధరల సంకెళ్లు వేస్తుంటే...


బిగి కౌగిలి హృదయాన్ని బిగించి వేస్తే

బరువైన మనసు బాధతో కావ్యమై పారింది

చెల్లా చెదరైన బ్రతుకు బొమ్మలాట

ఒకచోట చేర్చనీకి కాలంతో నడవలేక పోతుంది...


చాలీచాలని జీవితపు భత్యము 

మధ్యతరగతి మందహాసం లా వెక్కిరించే

పున్నమి చంద్రుడు అమావాస్యకు అలసిపోయినట్లు

నెల చివర్లో అరసున్నా మాత్రమే చేతికొచ్చే...


కొనలేని కూరగాయలు కోటి ప్రశ్నలు సంధిస్తూ

కిరాణా సరుకులు సంచి నిండక బాధించే

ఇల్లాలి మాట చెవుల్లో సీసములా అనిపించే

బ్రతుకు ప్రయాణం నత్త నడకలా సాగుతుంది...


నెల ఆదాయం పాతాళానికి పడిపోతుంటే

ఆశలు నింగిలో చక్కర్లు కొడుతున్నాయి

సంసార భారం ఎండాకాలం సూర్యుడిలాగా

నన్నెత్తిన కూర్చొని సతాయిస్తూనే ఉంది....


ఉన్నోడి మాటలకు విలువ ఎక్కువే కదా

లేనోడు ఎన్ని చెప్పినా పత్రికా ప్రకటనలే

ధరల పట్టిక సూక్ష్మ కంట్లో భూతద్దం లా కనిపించే 

రోజు కూలీకి రోట్లో పచ్చడే కష్టమై కూర్చుంది...


సగటు మనిషి జీవితం ముళ్ళకంపపై వస్త్రం

గులాబీ బ్రతుకులో ముళ్ళు లాంటిది ఆదాయం

జానెడు కడుపుకు పుట్టెడు దుఃఖంతో

మౌనముతో మాటలు రాక ఆకలితో ఏడుస్తున్నాయి..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational