STORYMIRROR

MohanKrishna Landa

Tragedy Inspirational

4  

MohanKrishna Landa

Tragedy Inspirational

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...

1 min
52

బ్రతుకు భారమంతా సంచిలో సర్దుకుని, విలాసమైన జనాల నడుమ బ్రతుకుదామని‌, విపరీతమైన కోరికలతో ఊపిరాడక, ఈ ప్రపంచమనే తిరణాలలో తప్పిపోయావా... 

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...

తీరానికి చేరలేక, తినడానికి తీరికలేక, కలలు కూడా కరువై, తీరంలో కొట్టుకుపోతున్న, కొలువు కోసం కోయబొమ్మలా మారిపోయావా....

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...

బ్రతుకు బండిని నడపలేక, భారమైన బాధ్యతలు మోయలేక, కొలువు కొలనులో ఇమడలేక కొవ్వొత్తుల కరిగిపోతున్నావా..

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...

కొలువు పోయి, కోర్కెలు మిగిలి, కలలు మొత్తం చెదిరిపోయి, చిరిగిపోయిన సంచితో కొండ అంచున అలా ఒంటరిగా మిగిలిపోయావా...

ఓ వలస వీరుడా, వీలాసకారుడా...


Rate this content
Log in

Similar telugu poem from Tragedy