STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

ఓ గ్రహాంతరవాసి

ఓ గ్రహాంతరవాసి

1 min
283

మెల్లిగా ఇంకో ముఖం తొడుక్కుంది

మనిషిలానే ఉంది

మాటా పలుకూ

నడకా నడతా

అవన్నీ మనిషిలానే అనిపిస్తాయి


మొన్న నువ్వే ప్రాణం

నిన్న నువ్వు లేకుంటే బతకలేను అని చెప్పి

ఇవాళ ముఖం తిప్పుకుంటూ నడిస్తే

అస్థిత్వపు ఉద్యమం


చీటికీ మాటికీ

కొత్త గొడవలు సృష్టించి

స్నేహితుల్ని విడదీస్తే


గ్రహాంతర వాసి అని పిలవాలేమో

పోనీ కాసేపు కాదు అనుకుందాం 

మనల్నీ తనలా మార్చేస్తే


కొంపలంటుకు పోవూ

అసలే అందరిదీ పోయేకాలంలా ఉంది

ఇలా దూరం అవుతూ

ఫోన్ కు అతుక్కుపోయి ఉంటే


మనమే ఈ గ్రహానికి కొత్త అవుతాం

ప్రకృతిని వేరే గ్రహానికి పంపి

అప్పుడు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ

గడపాలేమో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract