ఒంటరివి కాదు నీవు
ఒంటరివి కాదు నీవు


ఒంటరివా
కాదు నువ్వు ఒంటరివి కాదు
మిత్రమా
ఎవరో చెప్తే కాదు
ఎవరో నిన్ను తక్కువ చేస్తే కాదు
నువ్వు ఒప్పుకునేంత వరకు నువ్వు ఓడిపోయినట్టు కాదు
ఓటమిని ఒప్పుకోకు
మరొక్క సారి ప్రయత్నించు
ఒంటరివి కాదు
నీ గెలుపు కోరుకునే వాళ్ళ కోసం
నీ వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం కోసం
ఒంటరివి కాదు
క్రుంగిపోకు ఆగిపోకు
నువ్వు ఒంటరివి కాదు
నీకు నువ్వే తోడుగా సాగు ముందుకు
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాట నిజము చేసి
నీ వారి వదనాలలో చిరునవ్వులు పూయించు
ఒంటరివి కాదు నీవు