STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఒక్కో నిముషం

ఒక్కో నిముషం

1 min
299

వదలలేక నేను

విడిపించుకుంటూ నువ్వు

మధ్యలో విమానాల కూతలు

అప్పుడు నువ్వెళ్ళిపోయావ్


ఇక్కడే ఈ దేశంలో ఉండి ఉంటే

ఏదో రోజు నిన్ను కలవచ్చు అనుకున్నాను

ఎవరి పెళ్ళిలోనో లేదా చావులోనో

అదే పొరపాటున అయినా చూడొచ్చు కదా


ఇక నువ్వెప్పటికీ రావని అంటున్నారు

నా మాటలు నిన్ను చేరవు అంటున్నారు

సముద్రం ఉంటుంది కదా మీ దేశంలో కూడా

నేను రోజూ సముద్రపు ఒడ్డున కూర్చుంటున్నా


నీకు చెప్పాల్సినవి అన్నీ అలలుగా పంపిస్తున్నా

నువ్వు అందుకో ఆవలి వైపు

నీ ప్రతిబింబం చూడాలని

సముద్రాన్ని రోజూ అడుగుతూ

ఒక్కో నిముషం ఇసుక రేణువులతో వాదిస్తూ

ఇలా ఎదురు చూస్తున్నా



Rate this content
Log in

Similar telugu poem from Abstract