STORYMIRROR

Midhun babu

Romance Fantasy Others

4  

Midhun babu

Romance Fantasy Others

ఒకే ప్రాణం

ఒకే ప్రాణం

1 min
11


నువ్వూ నేను సంగమమేగా
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో 
ఓ పుట్టుమచ్చలా ఓ..పచ్చబొట్టులా !
ఒకటే ఊపిరిలా ఒకటే హృదయమై 
ఎల్లలు ఎరగని దివ్య లోకమేగా ప్రేమంటే,
ప్రేమకు లేదు బాష్యం,ఇరువురికీ 
అదో అందమైన దివ్య ఔషధం

నువ్వు నేను ప్రేమ 
ఇదో అందమైన ప్రేమ పర్వం
చెరగని ప్రేమకు శ్రీకారం;
కలకాలం నిలిచే కమ్మని కావ్యం 
కల్యాణ గడియలు రానే వచ్చాయి 
ఇక మోగాలి మంగళ వాయిద్యాలు, 
నిత్యమై శాశ్వతమై నిలవాలి ఈ బంధం

నువ్వుంటే చాలు నీ నవ్వుంటే చాలు 
ఎన్ని కల్లోల సునామీలైనా దాటేస్తాను 
నీ అడుగుల సవ్వడి తాకితే చాలు 
గుండె గూటిలో వినిపించేను 
సమ్మోహన రాగం;నీ నవ్వుల వెలుగుల 
కాంతిలో తళుకు తళుకుమనేను 
కోటి నక్షత్రాల జిలుగులు

ఈ జన్మ ఏ గమ్యం చేరినా భావంలోనూ 
భావనలోను బతుకులోను బాసటలోను 
తోడు నీడగా కలిసిపోదామా 


Rate this content
Log in

Similar telugu poem from Romance