ఒక స్వప్నం
ఒక స్వప్నం
జీవితం ఒక స్వప్నం మైతే
జీవితం ఒక స్వప్నమైతే స్వర్గమే !
అందాల లోకం కనుల ముందుంటే
ఆకలిలేని ఆ లోకములో ఆనందమే !
ప్రేమతో నింపిన చల్లని జాబిలి చెంత
ఆటా పాటలతో మైమరచి పోవాలి,
చిన్ననాటి చెలిమితోనే కలలు నిండాలి
కధలు,కవితలు పండాలి
కలల సౌధాలన్నీ కళ్ళముందే ఉండాలి
నిరాశ నిస్పృహలు లేని ఆశల సౌధంలో
నవ్వులు పువ్వులై పరమళించాలి ప
గలే వెన్నెలై ధగధగ మెరవాలి
మంచులా కరగిపోక కల కాలం నిలవాలి
అందమైన స్నాప్నికురాలినై
నిరీక్షణలన్నిటికీ సెలవిచ్చి గగనాన
మబ్బుల్లో తేలిపోతూ నిత్య ఉల్లాసంగా
వసంతఋతువుతోనే దోబూచులాడుతూ
ఆనంద నందన తీరాలకు చేరాలి,
అమృతం తాగి అమరత్వాన్ని పొందాలి,
నవమన్మధునితో సయ్యాటలాడుతూ
ఇలలోకంటే కమ్మని కలలే సౌఖ్యమని
సుందరమని శాశ్వతమైపోవాలని
అలా ..అలా..గాలిలో తేలిపోవాలనే
అశ నా ఉచ్ఛ్వాసనిశ్వాస
