ఒక హోలీ
ఒక హోలీ
హృదయ వాటికల గోడలపైన
నీ మోము చిత్రించిన రంగు
అరుణ వర్ణపు క్రీడ
వలపు పొంగు కాదా
వైద్యం కొరకు ఎదురుచూస్తూ
రోగి చూసే మందుల రంగు
పసుపు వర్ణపు క్రీడ
ఆయువు పట్టు కాదా
చెమట చుక్కలు రాలి
పచ్చపచ్చని నోట్లు
నీ జేబు చేరిన
అది అసలు క్రీడ కదూ
రంగు రంగుల హోలీ
కేవలం చల్లుకునే రంగుల్లో కాదు
సకారాత్మకత వైపు చేసే ప్రయాణంలో ఉంది
అందరినీ కలుపుకుంటూ
ద్వేషాన్ని వదులుకుంటే
అదే అసలు మానవత్వపు రంగు చూపిస్తుంది
అనంతాకాశపు నీలం రంగుపైన
కల్మషం లేని చిరునవ్వుల రంగు
అలవోకగా పులిమేద్దాం
అందరితో కలిసి హోలీ ఆడేద్దాం
ఒక హోలీ
ప్రపంచానికి జ్ఞాపకంగా చేద్దాం
