jayanth kaweeshwar

Inspirational

5.0  

jayanth kaweeshwar

Inspirational

నూతన సంవత్సరం - నూతన జీవితం -

నూతన సంవత్సరం - నూతన జీవితం -

2 mins
354




గత సంవత్సర తీపి జ్ఞాపకాలతో - భవిష్యత్తు ఫై కొత్త ఆశలతో ఆహ్వానిం చి ,

ఆస్వాదించాలి కొంగ్రొత్త సంవత్సరాన్ని : 

నిర్ణయాలను నిశ్చయముగా అనుకరిస్తూ ,

ఆస్వాదిద్దాం క్రొత్త జీవన గమనాన్ని .


గత స్మృతులను గుణ పాఠాలు గా భవిష్యత్తున(కు) సాధనాలుగా జీవిత గమ్యాన్ని 

చేరుకోవడానికి అహర్నిశలు పాటుపడి గెలుపును పొందాలి .


అంతర్గత శత్రువులను అడ్డగించి ప్రేమ , శాంతి ,

పవిత్రతతో సమ సమాజ అభివృద్ధికి పాటు పడాలి .


జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి , చేతనైనంతగా

ప్రగతి పథంలో పయనించి జీవన గమ్యాన్ని చేరుకోవాలి . 


పర మత సహనం తో , జాతీయ సమైక్యత తో , వారియొక్క సంప్రదాయ విలువలను

గౌరవిస్తూ అందరితో కలసిమెలిసి జీవితాన్ని గడపాలి .


పెద్దల మాటలను గౌరవిస్తూ , ఆచరిస్తూ మీరు అభివృద్ధి పథంలో పయనిస్తూ ,

ఇతరుల అభివృద్ధిని తప్పనిసరిగా ఆకాంక్షించాలి.


నీవు ఎదుగు : ఇతరుల ఎదుగుదలకు సహాయపడి దేశ భవితకు ఆదర్శం గా

కీర్తి ప్రతిష్థలను పెంపొందించుకోవాలి :


దోష రహితుడుగా వెలుగొందాలి.  



Rate this content
Log in

Similar telugu poem from Inspirational