STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

3  

Dinakar Reddy

Abstract Drama Romance

నన్ను తాకిన మేఘం

నన్ను తాకిన మేఘం

1 min
161

నన్ను తాకిన మేఘం

ఇళయరాజా సంగీతం

వేటూరి సాహిత్యం

సాగుతుంది నా యదలో అమృత నర్తనం


నిన్ను కదిలించిన రాగం

సాయం సంధ్యలో సింధు భైరవి

ఉషోదయంలో రేవతి

పాడింది మధుర కీర్తనం


నన్ను ఆడించిన తాళం

ప్రదోషంలో శివతాండవ స్తోత్రం

సూర్యోదయంలో మహా గణేశ పంచరత్నం


నిన్ను వలచిన లగ్నం

శుభలగ్నాల శ్రావణం

మనువులాడే మాఘం


నన్ను నిన్ను కలిపింది

వేళా పాళా లేని తరంగాల పయనం

పౌన: పున్యాల సంగమం


నేను నువ్వు తాగిన మేఘం

రాపిడితో కరిగిన ప్రేమ లాంటి వర్షం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract