నిశ్చల ప్రేమమూర్తి
నిశ్చల ప్రేమమూర్తి


నిశ్చలప్రేమమూర్తి
.......................
నరునిగా నీవెంత నిర్లక్ష్యం చేస్తున్నా
తరువుగా తానెన్ని సార్లైనా
ఛస్తూపుడుతోంది నినుప్రేమిస్తూ
** ** **
తాను బ్రతికున్నంతకాలం........
ఎండలో వానలో ఛత్రమైకనిపిస్తోంది
ఫలమై రసమై ఆకలితీరుస్తోంది
ఔషధమై రోగాల్ని తరిమేస్తోంది
విషాల్ని వడగట్టి ప్రాణవాయువందిస్తోంది
** * * &nb
sp; **
నీవే తనని కూల్చిచంపినా
నీ నివాసమై సేవచేస్తోంది
నీవు ఛస్తే నీతో పాటుసహగమనం చేస్తోంది
** ** **
యుగయుగాలుగా నిరంతరంగా
నీతో సహచరిస్తున్న ధర్మమూర్తి!
నిన్ను ప్రేమిస్తున్న నిశ్చలప్రేమమూర్తి!
వృక్షమే సుమా! ఇక గ్రహించుమా!
గౌరవించుమా!
ఇక తరించుమా!
పెంచుమా! ప్రేమపంచుమా!
హరితాహ్లాదకలితంగా
మహదానందభరితంగా
మహినిమార్చుమా! మర్త్యమిత్రమా!