STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

నిందలు

నిందలు

1 min
252

అదేదో సామెత చెప్పినట్టు

నిజాయితీ గా బతికేటోడికే

రాలుగాళ్ళ రాళ్ళ దెబ్బలట

నిందలు మోపడమే తప్ప

నిజ నిర్దారణ లు వుండవు

నీతులు చెబితే నచ్చవు వారికి

అసూయ అహాలు ఆవహించి

నిండు మనసును గాయం చేస్తారు

నిండు మనిషిని కుప్పకూలుస్తారు

ఆ నీలమేఘశ్యాముడికే తప్పలేదు

నీలాపనిందలు మోయడం

చింతిస్తూ చీకటిలోనే కూర్చుంటే

నిలువునా నిన్నే దహించేస్తుంది

నిజమైతే నిరూపించి చూపించు

నిజం కాదంటే నవ్వి ఊరుకుంటే సరి

అసూయకు తొలిమెట్టు నింద

చేతగాని తనానికి చిరునామ నింద

అందుకే..నిందలకు బెదరకు

ఉలిదెబ్బలకు శిల్పం రూపుదిద్దుకున్నట్టు

గాయాలకు వెదురు వేణువైనట్టు

నిప్పుల కొలిమి నుండి బంగారంలా

మేలిమై మరింత మెరుగులు దిద్దుకోవడమే

నిందలు మోసేవాడి ప్రథమ కర్తవ్యం



Rate this content
Log in

Similar telugu poem from Fantasy