STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Drama Action Inspirational

నిజమా..నువ్వు మాకొద్దు

నిజమా..నువ్వు మాకొద్దు

1 min
2.0K


ఆ రూపం.. కమనీయం

ఆ స్వరం..రమణీయం

ఆతని లీలలు..అనంతం

ఆతని సృష్టి .అద్భుతం

అని..కాంచిన వారు

కథలు కథలు గా చెప్పంగా

కీర్తనలుగా..పాడంగా

పద్య కవితలుగా.. పలుకంగా

విని.. చదివి.. మురిసిపోతిని


ఆతనికి..పేర్లు అనేకం

రూపాలు...అనేకం

అతను మాత్రం ఏకైకం..అతనే దేవుడంట


ఓ..దేవయ్య..నిన్ను సూసెందుకు..

కఠోర తపస్సు.. సేసిన

కఠోర నియమాలు.. సూసిన

అయిన నువ్వు పత్యక్షం .కానేదు

ఇంక..నాభం నేదని

నిన్ను కలుసుకోవాలని.. నీ దగ్గరకే వచ్చేసిన


ఆత్మనై...

అనంత నోకాలు తిరిగిన

ఏడ అగుపించ నేదు

ఏంది సామి.. నీకోసం

గుడి మెట్లెక్కి న..గుడి కట్టించిన

దానాలు సేసిన..దారులు కాసిన

నాకు తెలవక అడుగుతున్న సామి

సత్తంగా... నువ్వున్నావ..నేవా?


నే సదువుకున్నప్పుడు ఇన్న..

మనిషికి.. భమలో బతకడమే

చాన ఇష్టం అంట గంద

ఇప్పుడు తెలత్తాంది.. ఓ భూలోక వాసుల్లార

కంటికి అగుపడేవే..నమ్మని మనం

ఈ కల్పితాన్ని ...

ఎన్ని తరాలు మోత్తున్నం రా అయ్యా!


నువ్వు తల్లి గర్భంనొంచి పుట్టినా

దేవుడు పుట్టించుండు.. అంటవు

నీకు.. సేతకానివి.. నీ వల్ల కానివి

సేసేది... నీ తోటేడే అంటే. ఒప్పనేక

కనబడని వాడిపై.. నెట్టెత్తావ్


అవును సృష్టిలో జరిగే..

యెన్నో అద్భుతాలకు గా దేవుడే గంద

సృష్టికర్త..

మరి నాన రకాల అనర్ధాలకు కూడా

ఆయనే గంద

ఎందుకయ్యా..

పైనొకడున్నాడు.. పైనొకడున్నాడు అని

పడి పడి దండలెడ్తావ్!

పైనొక నోకం ఉందంటే..నమ్మేసే 

మన నమ్మకం..అనంత మైనదో..నేక

మన మూర్ఖత్వం.. అంతులేనిదో

తెల్టం...లేదు


ఓరయ్య..

ఎప్పుడెప్పుడు...దేవుడ్ని 

కలిసేసుకోవాల అని కాదు

ఏది నిజమో తెలుసుకోవాలా..

అని ఆలోచించండి


    .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Drama