నీపనిలే
నీపనిలే
నీ నవ్వే అసలు ఆస్తి..పంచటమే నీ పనిలే..!
నీ మనస్సు నీ శ్వాసన..చూడటమే నీ పనిలే..!
తిరుగేమీ ఆశించని..తత్వమేగ ప్రేమంటే..
ఏ జీ విని నొప్పించక..ఉండటమే నీ పనిలే..!
సొంతమైన దేమున్నది..పంతాలకు పోయేందుకు..
అసలు చెలిమి చిరునామా..కావటమే నీ పనిలే..!
అంతులేని పగలతోటి..జన్మలెన్ని ముగిశాయో..
వివేకముతొ చిత్తశుద్ధి..పొందటమే నీ పనిలే..!
తప్పుకొనుట తెలియకనే..ముళ్ళదారి పాలవటం..
సరసయుక్త సంభాషణ..నెఱపటమే నీ పనిలే..!
