నీకు నాకు
నీకు నాకు
ఎన్ని తుఫానులో
ఎన్నెన్ని ప్రకంపనలో
నీకు నాకు మధ్య.
అయినా...
బంధాల వేర్లేమో
ఇంకా ఇంకా లోలోపలకి
హృదయాంతరాలలోకి
మరింత తీవ్రంగా
వ్యాపిస్తూనే ఉంటాయి
తుఫానులను పగలగొట్టేంతగా..
ప్రకంపనలు నివ్వెరపడునట్లుగా..
అవును మరి
నువ్వు నాటింది
మెత్తని ప్రేమ విత్తనం.
