నీ మీద ప్రేమయ్యో ..!
నీ మీద ప్రేమయ్యో ..!
( కవితలా చదవండి )
నీమీద నాకు ప్రేమయ్యో
ఆ మాట నీకేమో చెప్పలేక సిగ్గయ్యో
నీమీద నాక్కూడా ప్రేమమ్మో
ఆ సంగతి నీతో చెప్పాలంటే అదెమ్మో
( నీమీద )
ఎప్పుడు కనపడ్డా అదే ఇదయ్యో
నావద్దకు ఈరోజే రావయ్యో
వచ్చేస్తా నీ కౌగిలికి వినవమ్మో
తీర్చేస్తా ఆ దాహం తొందరలో చూడమ్మో
( నీమీద )
సందెచీకట్లు ముసిరేవేళ
జాబిలమ్మ వెన్నెల కురిసేవేళ
మల్లెలవాసన పీల్చేసి
రేయంతా ముద్దులతో ముంచేసి
నా ముచ్చట తీర్చేలా రావయ్యో
మగసిరికల బావయ్యో నీవయ్యో !
చల్లగాలి వీచేవేళ
సంద్రంలో కెరటాలే ఎగసేవేళ
మంచెకాడ పక్కేసి
చేపపులుసు ఘుమఘుమగా చేసేసి
నాకోసం ఆత్రంగా చూడమ్మో
నీ వయసును దాచెయ్యక పంచమ్మో !
( నీమీద )
