STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Action

4  

Dinakar Reddy

Abstract Drama Action

నీ కథకు..

నీ కథకు..

1 min
282

ఒక వయసు వచ్చే వరకూ నాన్నే హీరో

ఒక వయసు వచ్చాక

నాన్న కన్నా పెద్ద వ్యక్తి

సినిమాల్లో నటిస్తుంటే అతనే మన హీరో


కాస్త స్టైల్ గా కనిపిస్తే హీరో

కొంత రఫ్ గా మాట్లాడితే హీరో

సిగ్గు లేని పనులు చేస్తే హీరో


ఇలా హీరోకి నిర్వచనం మారుతోంది

మారుతూనే ఉంటుంది

పోతే పోనీ

ఇంతకూ నీ కథకు హీరో ఎవరు


వయసుతో పాటు వచ్చే జ్ఞానమా

వయసు మళ్ళినా తీరని ఆశల దాహమా

ఏది నిర్ణయిస్తుంది నీ బుద్ధిని


ఏ మాటకామాట

నిజ జీవితంలో హీరోని చూసి

ఎక్కువ శాతం జాలిపడతారు

కాకపోతే అవన్నీ మంచితనం మరుగున పడి

నిన్ను మభ్య పెడుతూ ఉంటాయి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract