నీ కోసం
నీ కోసం
కళ్ళెత్తి చూడు కళ్ళకి కనకాభి షేకం చేస్తాను
మాట ఇచ్చి చూడు మరణం దాక తోడోస్తాను
మనసిచ్చి చూడు మధురాంతకం రాసేస్తాను
పలవరించి చూడు పారిజాతాల పరిమళమై పలకరిస్తాను
మల్లెల వసంతమై నీ సిగలో చెంగల్వ దండనవుతాను
నీ వాకిట్లో నేను రంగవల్లినవుతాను
నీ చూపులలో గీసే చిత్ర గీతికనవుతాను
నీ మనసు లోగిలిలో కదిలిన ప్రేమఝరినవుతాను
నీ యదలో విరిసిన ఇంద్రధనుస్సు విరినవుతాను
నీ ఎదుట పూసిన వెన్నెల పూదోటనవుతాను
నీ చేతిలో చెక్కిన అపరంజి శిల్పాన్ని అవుతాను
నీ కలంలో నుండి జాలువారిన భావరాగం అవుతాను
నీ కౌగిలిలో కడదాకా కనురెప్ప మూసేదాక తోడుంటాను
