STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

నీ జ్ఞానం మా ప్రాణం..

నీ జ్ఞానం మా ప్రాణం..

1 min
388


నీ తెలివి తెలుపంగ

నీ పెదవి పలుకంగ

నీ కలము కదుపంగ

రోగి ఇంటికి వెళ్లు ధైర్యంగ


గణపతికి శిరస్సు అతికిన శివయ్యల

కుంతికి కొడుకును ప్రసాదించిన సూర్యునిల

రామలక్ష్మణులకై సంజీవిని తెచ్చిన హనుమల

మానవ మాత్రులమైన మనకు.....వైద్యులు


వైద్యమంటే...సేద్యం

కలుపు తీసేసే కర్షకుడంటి వాడు

రోగాన్ని తరిమికొట్టే......వైద్యుడు


వైద్యుడు..

దేవుడన్న భావనకు ఆద్యుడు

ఆర్తులందరికీ......ఆరాధ్యుడు.


నేటి పరిస్థుతులు చూస్తుంటే..

కొంతమంది దురాశ పరులైన 

డాక్టర్ బాబులు వల్ల ...

మొత్తం డాక్టర్ జాతికే మకిలి అంటింది


ఒకరోజు పాలు విరిగాయని 

పాలవాడ్ని మారుస్తమేమో కానీ

పాలు కాదు గా

అలాగే

డాక్టర్ నచ్చకపోతే..

వేరే డాక్టర్ దగ్గరికే వెళ్తావు

యాక్టర్ దగ్గరికి కాదుగా


        .....రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action