నేను రచయితను కాదు
నేను రచయితను కాదు


నే వెన్నెల రాత్రుల శృంగార కేళి గురించి
వ్రాయలేను
దివిటీల వెలుగుల్లో బిక్కుమనే జీవుల బాధ వ్రాయగలను
నే వసంతాల మన్మథ బాణాల గురించి వ్రాయలేను
తగలబడిపోయిన అడవుల గురించి వ్రాయగలను
నే మృష్టాన్న భోజనాల గురించి వ్రాయలేను
ఆకలి కేకల గురించి వ్రాయగలను
నే పచ్చ నోట్ల జల్సాల గురించి వ్రాయలేను
కష్టపడి పని చేసే వారి చెమట వాసన గురించి వ్రాయగలను
నే గుండె లోతుల్లో సమాధి కాబడ్డ నిజాలు వ్రాయగలను
కానీ
నేను రచయితను కాదు
బహుశా మీరు అనుకునే రచయితను కాదు.