STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Action Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Action Inspirational

"నా ప్రయాణం...!"

"నా ప్రయాణం...!"

1 min
260

"నా ప్రయాణం...!

ఆకాశాపు అంచులను అందుకోవాలనే లక్ష్యానికి అంతరిక్షపు కక్ష్యలోకి గురిపెట్టిన నా ఊహలను నెరవేర్చే ఓ ఆశల నిచ్చెన కోసం

ఎదురు చూస్తూ...!!

నా ప్రయాణం...!

ఆలోచనల కారు మబ్బులు దురాక్రమణలతో నా మదిని ఆవహించిన వేళ ఒక చిన్న ఎడతెరిపి లాంటి సమాధానం కోసం

ఎదురు చూస్తూ...!!

నా ప్రయాణం...!

కాలాలు మారుతున్న గాయాలు మానని నా ఎద వాకిటి ఎడారిలో చిగురించే ఓ అందమైన పూదోట కోసం

ఎదురు చూస్తూ...!!

నా ప్రయాణం...!

గతం చేసిన పొరపాట్లకు, కాలం మిగిల్చిన గాయాలతో గండిపడిన నా ఆశయాలకు భవిష్యత్తు అందిచే ఓ మందు మాన్పు కోసం

ఎదురు చూస్తూ...!!

నా ప్రయాణం...!

కళలు కలలుగా మిగిలి, కథలు వ్యధలుగా మారి చీకటి ఆవహించిన మార్గంలో ఒంటరినై భారంగా కదులుతున్న ఈ బాహ్యదేహాపు అనువులన్నీ నా అంతరాత్మతో కలగలసి దైర్యంతో ముందుకు వేసే అడుగు కోసం

ఎదురు చూస్తూ...!!

నా ప్రయాణం...!

నాలో నన్ను నేను కోల్పోయిన ఒకప్పటి నేనే,

ఆ నాలో నన్ను నన్నుగా నన్నే,

క్షణ క్షణం నిరంతర వీక్షనతో...

ప్రతి క్షణం మరింత నిరీక్షణతో...

అనుక్షణం అన్వేషిస్తూ...

పద్మహ్యూహపు వలలో చిక్కుకుని బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఫలించే ఆ రోజు కోసం

ఎదురు చూస్తూ...!!

నే ఏర్పరుచుకున్న గమ్యం వైపు

నా ఈ ప్రయాణం...!!!"

- Satya Pavan Writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract