నా పేరు కేరళ
నా పేరు కేరళ
నా పేరు కేరళ
నా అవతరణ 1956, నవంబర్ 1న,
నా రాజధాని తిరువనంతపురం
నా అధికార భాష మలయాళం
నా నృత్యం కథాకళి, ఏకైక భారతీయ శాస్త్రీయ నృత్య నాటకం,
నా పండుగ ఓనమ్
నేను నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్నాను
నాకు కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈరెంటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా పేరుంది
నన్ను "God's own country" భగవంతుని రాజ్యంగా పిలుస్తారు
నా జీవవైవిధ్యం భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు, 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు (endemic) స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు నా నేల మీద ఉన్నాయి
నేను మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా నిలిచాను
నన్ను ఐక్యరాజ్యసమితి శిశు సంక్షేమ నిధి(UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంస్థలు
"పిల్లలకు అనుకూలమైన రాష్ట్రము" అని మన్ననలు అందుకొన్నాను.
నా ప్రత్యేకమైన కళారూపాలు కథాకళి, కూడియాట్టం, కేరళనటనం, మోహినియాట్టం, తుల్లాల్, పాదయని, తెయ్యం –ఇంకా చవిట్టు నడకొం, ఒప్పన వంటి కొన్ని కళలు మతాలకు, కొండజాతులకు చెందినవి
నాకు ప్రత్యేకంగా మళయాళం కేలెండర్ ఉంది. దీనితో రైతులు తమ వ్యవసాయపనులు ప్లాన్ చేసుకొంటారు. మతసంబంధమైన (తిథి వగైరా)విషయాలు, పండుగలు ఈ కేలెండరు ఆధారంగా నిర్ణయిస్తారు.
నా భోజనాన్ని "సద్య" అంటారు. అరటి ఆకులలో వడ్డించడం సంప్రదాయం. ఇడ్లి, పాయసం, పులిషెర్రి, పుట్టుకడల, పుళుక్కు, రసం, సాంబారు - ఇవి నా సాధారణమైన భోజన పదార్ధాలు.
నా పర్యాటక ప్రదేశాలు
చారిత్రక జట్టడాలకు తిరువనంతపురం
కాలువలకు అలప్పుజ (వెనిస్ ఆఫ్ ది ఈస్ట్)
వన్యప్రాణుల అభయారణ్యాలకు కల్పట్ట,
'కళరిపయట్టు' మార్షల్ ఆర్ట్స్, 'థేయం' ఆలయ నృత్యలకు,సుగంధ ద్రవ్యాలకు-కన్నూర్,
ప్రధాన నౌకాశ్రయాలకు కొచ్చి (కొచ్చిన్)'అరేబియా సముద్రపు రాణి' అంటారు
మలబార్ ప్రాంతం యొక్క గుండె మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి-కోజికోడ్ (కాలికట్) ఇక్కడ వాస్కో డా గామా భారతదేశంలో మొదటిసారిగా అడుగుపెట్టారు.
అంతులేని రోలింగ్ టీ ఎస్టేట్స్,ఎరవికుళం నేషనల్ పార్క్-మున్నార్
ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది భక్తులను ఆకర్షించే అందమైన పర్వత ఆలయం-శబరిమల
వన్యప్రాణులకు మరియు బోటింగ్ ప్రధాన ఆకర్షణలు; అత్యంత సుందరమైన ప్రదేశం-టెక్కడి
పెరియార్ నేషనల్ పార్క్ - భారతదేశంలోని అతిపెద్ద పులుల జనాభాలో ఒకటి
సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ - అనేక అంతరించిపోతున్న, రక్షిత జాతులతో వర్షారణ్యము
నన్ను నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్ కేరళను "ప్రపంచంలోని పది స్వర్గాలలో ఒకటి" మరియు "జీవితకాలపు 50 ప్రదేశాలలో" ఒకటిగా పేర్కొంది.
నా ఒడిలోనే కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా ఉంది.
("ఒనమ్" పండుగ సందర్బంగా.......)
