నా పేరు ఝార్ఖండ్
నా పేరు ఝార్ఖండ్
నా పేరు ఝార్ఖండ్
నా అవతరణ 2000 నవంబరు 15న
నా రాజధాని రాంచి
నా అధికార భాష సంతాలి
నా నదులు కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు జన్మస్థానం.
నా జీవ వైవిధ్యం,
జాతీయోద్యానవనాలు,జంతు ప్రదర్శన శాలలు
బెల్టా నేషనల్ పార్క్ ("ప్రాజెక్ట్ టైగర్" రిజర్వు)
హజారీబాగ్ వన్యప్రాణి అభయారణ్యము -
నా నేలలు-
ఎర్ర మట్టి నేల- దామోదర్ లోయ,
రాజమహల్ ప్రాంతాలలో
మైకేషియస్ నేల (Micacious soil - మైకా ఖనిజ రేణువులతో కూడిన నేల) - కోడెర్మా, ఝూమెరితిలైయా, బర్కాగావ్,
మందర్ కొండలు ప్రాంతాలలో
ఇసుక నేల - హజారిభాగ్, ధనబాద్ ప్రాంతాలలో
నల్ల నేల - రాజమహల్ ప్రాంతం
లేటరైట్ నేల (Laterite soil) -, పశ్చిమ రాంచీ, పలమూ, సంథాల్ పరగణాలు, సింగ్‌భమ్ ప్రాంతాలలో
నాకు దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున ఝార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు.
నను భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు ప్రస్తావించారు.
నా పారిశ్రామికనగరాలు రాంచి, జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్ కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.
నా సరిహద్దులు ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒడిషా రాష్ట్రాలున్నాయి.
నా ఆర్ధిక వనరులు:
నా ఒడిలో దేశంలో మొదటి ఇనుము-ఉక్కు కర్మాగారం జంషెడ్‌పూర్‌లో నిర్మించారు.
నేను ఖనిజసంపదకు పెట్టింది పేరు.
ఇనుము (దేశంలో మొదటి స్థానం)
బొగ్గు (దేశంలో 3వ స్థానం)
రాగి (దేశంలో మొదటి స్థానం)
మైకా (దేశంలో మొదటి స్థానం)
బాక్సైటు (దేశంలో 3వ స్థానం)
మాంగనీస్
సున్నపు రాయి
కైనైటు (దేశంలో మొదటి స్థానం)
క్రోమైటు (దేశంలో 2వ స్థానం)
ఆస్బెస్టాస్ (దేశంలో మొదటి స్థానం)
థోరియం (దేశంలో మొదటి స్థానం)
సిల్లిమనైటు
యురేనియం (దేశంలో మొదటి స్థానం) - జాదుగుడా గనులు, నర్వా పహార్
బంగారం (దేశంలో 6వ స్థానం) - రఖా గనులు
వెండి
నన్ను పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని వర్ణింపవచ్చును.
