STORYMIRROR

Maha Kailash

Classics Fantasy Inspirational

4  

Maha Kailash

Classics Fantasy Inspirational

నా‌ కవి

నా‌ కవి

1 min
278


         

  




  ఓ నా కవి .......


    నాలోని భావాలకు మూలం నీ కవిత్వం...



గొంతు దాటని భావాలను పలికించే గళం నువ్వు.......



కాలాన్ని శాసించే కాల యముడు నువ్వు......



ఓ నా కవి .....


  నాలోని భావాలకు మూలం నీ కవిత్వం ...



నీ లోని భావాలను అక్షరాలుగా మార్చి నవయుగం అనే నావను నడిపించే నావికుడు‌ నువ్వు.......



 ఓ నా కవి ......


   నాలోని భావాలకు మూలం నీ కవిత్వం....



నీ కలం తో కాలాన్ని కాల రాయగల విధిరాతవు నువ్వు ......



అక్షరాలతో స్నేహం చేసే సుందరాంగుడివి నువ్వు...‌.‌



ఓ నా కవి......


    నాలోని భావాలకు మూలం నీ కవిత్వం....



కవీశ్వరుడావై కరిగిపోయిన కాలాన్ని కదిలించ గలవు ......



కదలాడని బతుకులకు ప్రాణం పోయా గలవు..



ఓ నా కవి.....


   నాలోని భావాలకు మూలం నీ కవిత్వం...



సమాజాన్ని ప్రశ్నించేలా, మనిషి విలువ పెంచేలా..



నీ వ్యక్తిత్వం జాడలు ఎప్పటికీ మిగిలేలా బలంగా నీ అడుగులు పడాలి .....



ఓ నా కవి....


   నాలోని భావాలు మూలం నీ కవిత్వం.....



చెరిగిపోని చరిత నువ్వు.....



చలించని చరిత్రవు అయ్యావు...........



ఓ నా కవి......


  నాలోని భావలకు మూలం నీ కవిత్వం.....




Rate this content
Log in

Similar telugu poem from Classics