నీ - "జీవి"తం
నీ - "జీవి"తం
నీ - "జీవి"తం
ఏమైపోతుందో నా జీవితం ....
నిరాశ ,స్వార్థాల వద్దా నిజంలా నిలబడిన నా జీవితం .......
ఏమైపోతుందో నా జీవితం .....
బస్తాలు లాంటి పుస్తకాలను మోసుకుపోయే నా జీవితం ......
భవిష్యత్తుకు బంగారు బాట అంటే నమ్మడం ఎలా?.....
ఏమైపోతుందో నా జీవితం......
సెలవు రోజున కూడా సంతాప దినాలుగా మారాయి
.....
నా ఊహలకు రెక్కలు మెలవడం ఎలా....?
ఏమైపోతుందో నా జీవితం ......
నా లక్షణాలను లక్ష్యాలుగా మార్చే నవయుగం ఎక్కడ ....?
భవిష్యత్తుకు బలం చేకూర్చే యుగం ఎక్కడ?
ఏమైపోతుందో నా జీవితం......
గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది .......
పడిలేచే బ్రతుకులే అందరివి......
ఏమైపోతుందో నా జీవితం .....
కన్న కలలు వేరే ఏమో చేసే కష్టం ఒక్కటే .....
సాగే దారులు వేరే ఏమో చేరే గమ్యం ఒక్కటే..
ఏమైపోతుందో నా జీవితం......!!
