నా దేశంఅంతం లేని అస్తిత్వం
నా దేశంఅంతం లేని అస్తిత్వం
ప్రపంచ జనాభాలో రెండో స్థానం
వైశాల్యములో ఏడవస్థానం
28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు
22 అధికారిక భాషలు
పార్లమెంట్ చే పాలించబడే సమాఖ్య
స్వేచ్ఛను ప్రసాదించిన పెద్ద ప్రజాస్వామ్యం దేశం
సైనిక, అణ్వస్త్ర సామర్థ్యం తన సొంతం
ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము
రైలు, రోడ్డు, వాయు, జల చారిత్రక వాణిజ్య
మార్గాలు, రహదారులతో అఖండ దేశాన్ని
కలుపుతూ ఉపఖండముగా పేరుగాంచిన దేశం
మన భారత దేశం
తూర్పున బంగాళాఖాతం
పశ్చిమాన అరేబియా సముద్రం,
దక్షిణాన హిందూ మహాసముద్రం,
ఉత్తరాన పెట్టని కోట హిమాలయ శ్రేణులు
ఎల్లలుగా ఉన్న దేశం భారతదేశం
పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్,
నేపాల్, భూటాన్, ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక,
మాల్దీవులు ఇండోనేసియా ద్వీప-దేశాల
సరిహద్దులను పంచుకుంటున్న దేశం భారతదేశం
త్రివర్ణ పతాకము, మూడు తలల సింహపు బొమ్మ
జనగణమన, వందేమాతరం, నెమలిపావో క్రిస్టాటస్ పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్)
హాకీ, కమలము (తామర), శక క్యాలెండర్,
మర్రిచెట్టు, మామిడి పండు జాతీయ చిహ్నాలు
కలిగిన దేశం మన భారత దేశం
సింధు లోయ నాగరికతకు పుట్టినిల్లు
హిందూ, బౌద్ధ, జైన,సిక్కు
మతములకు జన్మస్తానం
బహుభాషా, బహుళ జాతి సంఘము
వివిధ వన్యప్రాణుల వైవిధ్యం
భిన్నత్వంలో ఏకత్వం గల దేశం భారతదేశం
కర్ణాటక, హిందూస్థాని శాస్త్రీయ సంగీతాలు
సినిమా, జానపద పేరుపొందిన సంగీతాలు
భరతనాట్యం, ఒడిసి, కూచిపూడి, కథక్,
కథకలి శాస్త్రీయ నృత్య రీతులు
కబడ్డీ, ఖో-ఖో, గోడుంబిళ్ళ సంప్రదాయ ఆటలు
చదరంగము, క్యారము,పోలో, బ్యాడ్మింటన్ ఆటలకు పుట్టినిల్లు మన దేశం భారత దేశం
తాజ్ మహల్,బౌద్ధ స్థూపాలు, ఖజురాహో, మహాబోధి మందిరాలు, మహాబలిపురం, సాంచి, చోళుల ఆలయాలు, కొనార్క్ సూర్య దేవాలయం, అమరావతి, అజంతా ఎలిఫెంటా, ఎల్లోరా, బొర్ర గుహలు, అరకు లోయలు, ,పుష్పాల లోయలు, సుందర్బన్ వనాలు, డార్జిలింగ్ పర్వత రైలు, పాపికొండలు, గోవా చర్చిలు, కాన్వెంట్లు, ఎర్రకోట, బింబెట్కా రాతికప్పులు, ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీ, కుతుబ్ మీనార్, , శివాజీ టెర్మినల్, పట్టాడకల్, జంతర్ మంతర్ ఇలా యునెస్కో ప్రకటించిన 38 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గల దేశం మన భారతదేశం
శతాబ్దాల పర్యంతం యుద్దాలతో, విప్లవాలతో
విదేశి దండయాత్రలతో విధ్వంసం సృష్టించిన
పాశ్చాత్య పోకడల బ్రమలకు, హోయలకు
తలకుబేలుకులకు తలొగ్గక, ఆత్మవిశ్వాసం కోల్పోకుండ నవజీవన రాగాన్ని అందిస్తున్న దేశం
నా దేశం భారతదేశం!
ఎన్నెన్నో మతాలు, తత్వాలు
అవతరించాయి, అంతరించాయి
ఎన్నో నాగరికథలు, ఎన్నో సంస్కృతులు
వెలిశాయి కఠిన పరీక్షలు ఎదుర్కొని
కాలగర్భంలో కలిసిపోయిన తన ఉనికిని,
అస్తిత్వన్నీ కోల్పోని దేశం మన భారతదేశం
మేరా భారత్ మహాన్ హై!
(75 వ సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలతో...........2021 )