నా దేశం, స్వరాజ్యం!
నా దేశం, స్వరాజ్యం!
అమర మైనది నా దేశ రాజసం,
స్వచ్ఛతకు మారుపేరు నా దేశం,
తెల్లజాతి శత్రువులను తరిమి కొట్టిన నా దేశం,
అనేక మేధావులను ప్రపంచానికి అందించిన నా దేశం,
వివిధ కళలను నిలువెత్తు రూపం నా దేశం,
నన్ను కాపాడే రక్ష కవచం నా దేశం,
అందానికి ప్రతిబింబం నా దేశం,
సకల సౌభాగ్యల నిలయం నా దేశం,
130 కోట్ల మంది ని మోస్తున్న నా దేశం,
రైతన్నల వ్యవసాయం చేసుకునే దేశం,
సమతా మమతల సాగరo నాదేశం,
అందుకే నా దేశం అంటే నాకిష్టం.
దేశాన్ని గౌరవిద్దాం,
అన్ని మతాలు ఒక్కటిగా చాటుదాం,
అందరిని మన అన్న, చెల్లెలు, అని భావిద్దాం,
మొక్కలని నాటుదాం,
మన దేశాన్ని పచ్చగా మారుద్దాం,
అందరం దేశ ప్రగతిని పెంచడానకి తోడు పడదాం.
ప్రపంచం అంటే దేశాల వ్యాప్తి,
భారత్ కు ఉంది ఘనకీర్తి!