STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

5.0  

Dinakar Reddy

Abstract Drama Tragedy

ముగింపు

ముగింపు

1 min
379

నువ్వు ఇవ్వగలవా

ఓ చక్కని పలకరింపు


నరాలు చిట్లే ఒత్తిడి

నలు వైపులా అలజడి


చుట్టూ శత్రు సైన్యాలు

కనుసైగల్లో తూటాలు

వద్దన్నా వీచే గాలిలా మరణం

వారించలేని సమయం


ఎడారి బంకరులో

ఆవిరవుతున్న చెమటలు

దూరమవుతున్న ఆశలు

చెప్పలేనంత బాధ

లెక్కపెట్టలేనన్ని ఇసుక రేణువులు


ఏవో గుర్తుకు వస్తున్నాయి

మరెన్నో మరచిపోతున్నాను

ఎక్కడో తూటాల శబ్దం

మళ్లీ నిశబ్దం

భయంకరమైన నిశ్శబ్దం

చావుకూ బ్రతుక్కూ మధ్య ఉండే నిశ్శబ్దం


అలాంటి సమయంలో

నువ్వు ఇవ్వగలవా

ఓ చక్కని పలకరింపు

అదే ఈనాటికి ముగింపు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract