STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మర్యాద మర్యాద

మర్యాద మర్యాద

1 min
383

నువ్వంటే ఇష్టం

నువ్వుంటే ఇష్టం


ప్రేమ లేకున్నా నువ్వుంటావా

ప్రశ్నలెందుకు అంటావా

ఇలాంటి ప్రశ్నలు వేసే చాలా మందిని దూరం చేసుకున్నావ్ 

అని అంటావా


అంతా బానే ఉంది

ఆ స్టైల్ ఆ నవ్వులు

ఇవన్నీ చూసి పడిపోవడం

దగ్గరికెళ్ళి వాళ్ళు మర్యాద ఇవ్వకపోతే

భంగపడి వెనక్కు రావడం


జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తి అయినా

ఎంత అందమైన వ్యక్తి అయినా

ఆ వ్యక్తి నీకు మర్యాద ఇవ్వనప్పుడు

నీ ఆలోచనలకు విలువ ఇవ్వనపుడు

ఆ ప్రయాణం ముళ్ళ దారే అవుతుంది


మరి పొద్దూకులూ ముళ్ళు తీసుకుంటూ

ప్రారభ్దాన్ని తిట్టుకుంటూ వెళ్లాలని ఉండదు కదా


అందుకే నాకు నువ్విష్టం

నువ్వుంటేనే ఎవరైనా ఇష్టం

మర్యాద లేని ప్రేమ దేనికి

బతుకులో ఆశల్ని మట్టి పాలు చెయ్యడానికి కాకపోతే

అందుకే 

మర్యాద మర్యాద


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract