STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

సొంతూరు- ఆనందాల పుట్టినిల్లు

సొంతూరు- ఆనందాల పుట్టినిల్లు

1 min
327

బాల్య జ్ఞాపకాల అనుభూతులు, 

ఆనందానుభూతుల సమ్మేళనాలు, 

ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, 

ఈర్ష, అసూయలు తెలియని ఆనంద విహారాలు

అమ్మ బడి వంటి ప్రేమానురాగాలు

అణువణువునా మనసును పులకరింపజేసే ఆనందతాండవాలు

కొత్త విషయాలకై పరితపించే హృదయం

నేల పంచే ఆప్యాయతకు కాదా బానిస

అనుక్షణం తపించే అలల అలజడులు

కావా మన ధైర్యానికి బాటలు

రాత్రివేళ అమ్మమ్మ చెప్పే చక్కని కథలు

శ్రీకారం పలుకవా మన భవితకు

అందుకే మా ఊరు ఆనందాల పుట్టినిల్లు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract