STORYMIRROR

T. s.

Tragedy Classics Others

3  

T. s.

Tragedy Classics Others

మరణించని మనసు..

మరణించని మనసు..

1 min
10

నిద్రిస్తున్న మనసుకు వినిపిస్తున్న చీకటి నిశ్శబ్ద రోదన

ఆదమరిచిన రాత్రికి అక్షరాల ఆవేదన..

ఊహలలో ఉయ్యాలలూగే కనులు తెరవలేక కన్నీరు అడ్డు తగులుతుంది..

మనసు గొంతు నుండి పలికే పదాలను ఒడిసి పట్టి సిరాతో రంగులు ఒలికించలేనన్నది..

నా మది వెదజల్లే వాక్యాలకి కలం కాగితాలతో కబుర్లు చెప్పలేనన్నది..

దాహం తీర్చలేని భావాలన్నీ ఎండమావుల తీరం వైపుగా సాగిపోయాయేమో..

అక్షరాల ఆకలి తీర్చలేక నిశ్శబ్దంలో ఒదిగిన కలాన్ని సానుభూతిగా చూస్తున్న మనసు తపో దీక్షలో కనుమూసింది..

అజ్ఞానాంధకారంలో మునిగిన జీవితంలోఎన్ని అవమానాలో..

విచిత్రం ఏంటంటే అంతులేని సంతోషాల్ని, భరించలేని బాధని ఇచ్చేది మరణించని మనసే..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy