మనసు
మనసు
నా మనసు అడుగుతుంది...
వేల భావాలు పలికించిన నీ మనసుకు ఏమయిందని.
దానికేం తెలుసు ఊహల ఊయలలూగిన జగంలో జనంతో జాగ్రత్తగా ఉండాలని.
కపట వేషదారులు కాచుకుని ఉంటారని.
పువ్వులాంటి మనసును చిధ్రం చేస్తారని.
దానికేం తెలుసు స్వచ్ఛమైన మనసు కాలిపోయిందని.
నా మనసు నుండి ఏ భావాలు పలకలేవని.
మౌనంగా ఉండే మనసు మరింత మూగబోయిందని.
కలం చివరన విషపు కథ రాసుకుని ఉంటారని.
వారి మాయ మాటలతో మన మనసును నలిపి నల్లబారేలా చేస్తారని.
మనసు కేం తెలుసు మనుషులే మరబొమ్మలవుతారని.
తమ మాటల గారడీ లతో వల పన్ని కత్తులబోనులో నిలబెడతారని.
మనుషులు మారణాయుధాలవుతారని.
మనసు కేం తెలుసు...
