STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

మనోసంకల్పం

మనోసంకల్పం

1 min
519

*****************

గుప్పెడు గుండెకు

ఉప్పెనంత ఊహలు

పిడికెడంత ప్రాణానికి

బోలేడన్నీ ఆశలు

గతమేమైనా

వదిలేయాలి

నేడేమైనా

అనుభవించాలి

రేపటి మీద మాత్రం

గంపెడంత ఆశతోనే

బ్రతకాలి మరి

ఆశలు ఆశయాలు

తీర్చుకునే మార్గంకై

అన్వేషణ సాగించాలి

ఆశల గమనం

అతుకుల గతుకులైనా

ఆలోచనకు పదును

పెట్టి సాగాలి

ఆశయ తీరం

ఎగుడుదిగుడులైనా

నేర్పుకు సాన 

పెట్టి సాగాలి

ఆశలు ఛిద్రమైన

ఆశయాలు భీతిల్లినా

మానస సరోవరం

ఎగసి పడును

ఆత్మవిశ్వాసం ముందు

అంగవైకల్యం ఏపాటిది

అనుకున్న లక్ష్యం ముందు

అవరోధాలు ఎంతటివి

సాధనతోనే సాగిపోతూ

గమ్యం చేరడమే

లక్ష్యం అధిగమించడమే

మనో సంకల్పం ముందు

అసాధ్యమన్నది 

మోకరిల్లక తప్పదు

విజయం సిద్ధించక మానదు



Rate this content
Log in

Similar telugu poem from Fantasy