STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Classics Fantasy

4  

VENKATALAKSHMI N

Romance Classics Fantasy

నీ.. నేను...

నీ.. నేను...

1 min
624

ఏ దివి నుండి దిగొచ్చిన

పారిజాతానివి నీవు

ఏ కవి కలం నుండి

ఉదయించిన ప్రేమ గీతానివి నీవు

నా మది మొత్తం ఆక్రమించి

నాకే చోటు లేదంటూ

నన్ను ఇరకాటంలో పెట్టావు

అణువణువునా నిండిన

నీ ప్రేమ స్వరాలు 

నిలువునా దహిస్తూ

బ్రతుకు వీణపై 

కోటి రాగాలు ఆలపిస్తుంటే

నీతో నేను నిత్యం జతకలపాలని

ఉవ్విళ్లూరుతున్న మనసుకు

తోడై జోడి కట్టి కడదాకా

వీడని సంకెళ్లు వేయగ రావా

మౌనంగా రోదిస్తున్న గుండె

తలుపులు తెరిచే వుంచా

నా ప్రేమను గెలిపించగ వస్తావని

వస్తావు కదూ,.ప్రేమతో నీ నేను..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance