STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy

వీడిన మనిషి విడిపోని మనస్సు

వీడిన మనిషి విడిపోని మనస్సు

1 min
716

నీవు నేను ఏకాంతపు గువ్వలం

నేను నీవు ఒంటరిగా ప్రవహిస్తున్న నదులం

అయితేనేం! ఇద్దరం సముద్రంలో కలవాల్సినొల్లమెగా!

నా మది తీపి రాగాలు తీయడం

మొదలు పెట్టినప్పడి నుండి 

నీకు విడుదల లేని జీవిత ఖైదీని నేను

అయితేనేం! నా మనసులోని మాటను 

నీవు ఎంతగానో అర్థం చేసుకుంటావు 

నాకు అది చాలు!


అందుకే! 

సంద్రం సమీపంలో చల్లని సమీరానికి

నెల వంక వెన్నెల్లో వేసవి సాయంత్రాల్లో 

వెయ్యి ఆశాలతో ఎదురుచూస్తూ

ఇసుక తిన్నెలల్లో అందాలను ఆరబోసుకొని కూర్చున్నా 

వడివడిగా సాగి తీరాన్ని చేరే కెరటంలా 

రివ్వున దూసుకొచ్చి నా ఒడిలో ఒదుగవా !


నా కలల అలలలో రాసులుగా చేసిన 

రంగు రాళ్ళు,పగడాలు, ముత్యాలు,

నా వలపు కొంగులో పోయవా

నీ దోసిళ్ళతొ నా దేహం మీద 

పారిజాత పుష్పాలను పరచవా

 విరబూసిన విరాజాజిలను విసరవా

పూర్తిగా పూసిన సంపెంగలను చల్లవా

గుబాలించిన గులాబీలను గుప్పవా

మత్థేక్కిస్తున్న మల్లెలను నా కురులలో తురుమవా


అస్తమించిన సూర్యుడిని చూడలేదని బాదపడకు

నా నుదుటన తిలకమై ఉదయించాడు చూడు

వెన్నెల కనుమరుగవుతున్నదని కలవరపడకు

నా నీలి కన్నుల్లో వెల్లి విరిసిన వెండి వెన్నెలని చూడు

నింగిలో మిణుకు మిణుకుమనే తారలను

నా మోములో విరబూసిన చిరునవ్వులలో వెదుకు


బతుకు దారుల్లో కలిసే వాళ్ళనేగా

పరిచయం చేసుకునేది అయితే మన

పరిచయం జీవితాంతం కొత్త కొత్తగానే ఉండాలి

కాలాన్ని బట్టే మారే స్నేహమే కదా ప్రేమగా మారేది

ఆ ప్రేమతో నీవు నా గుండెలో నిండి 

నా ఊపిరి అయ్యావు

నా తలపులతో, నా తపనలతో, 

నా వలపులతో, నా సొగసులతో 

తీయ్యని స్వర్గాన్ని చేశాను

రా! ప్రియతమ! 

విడిపోయిన మన మనసులను

మళ్ళీ కలుపుకుందాం !



Rate this content
Log in

Similar telugu poem from Romance