మనిషి
మనిషి
స్వార్ధపు సాలెగూళ్ళు కట్టి
సంధ్యపు సతమతలు చుట్టి
శరాల కోటలో నరాలే మూటకట్టి
సంతోష విషాదాల కలతలు రేపెట్టి
సమస్యలే కీటకాలకు సతతం పంచిపెట్టి
స్వేద జాతి సహనాలకు నిత్యం మట్టికొట్టి..!
ఉదయాది ఊసుల ఉరికమ్మలకు ఉట్టికట్టి
ఉదరపు ఉప్పులకు అప్పుల కుంపటిపెట్టి
ఉత్తరదిక్కు ఊరూరా ఉండ్రాళ్ళు పోసిపెట్టి
ఊహల సామ్రాజ్యపు ఒంటిస్తంభం నిలపెట్టి
ఊపిరాడని ఆశ అగాధఅంచుల్లోమడిచిపెట్టి
ఉక్కిరిబిక్కిరి వ్యసనాల పాలిట తనకాలేపెట్టి..!
జగాన్నే మాయచేస్తూ జనాలకు టోపీపెట్టేస్తూ
జగతి ప్రగతిని జలగ జీర్ణాశయానికి వదిలేస్తూ
జనాల మాన ప్రాణాలకు జఠర రసం పుసేస్తూ
జీవన్మరణ జక్కుల జాబితాలో నిను జారేస్తూ
జాబిలి అంద చందాల నిర్జీవ జావలే కారుస్తూ
జల్లెడ జానపద అడుగులే కలుగుల్లామూసేస్తూ..!!
