Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ఈవని రవిశంకర శర్మ

Inspirational

4.5  

ఈవని రవిశంకర శర్మ

Inspirational

మనిషే ఒక సందర్శకుడు !

మనిషే ఒక సందర్శకుడు !

1 min
307


# ఈ అందమైన లోకంలోకి మనిషి ఒక సందర్శకుడు .

# తను పుట్టేది శీతల ప్రదేశమో , ఉష్ణ మండలమో

తెలియనివాడు .

# వెచ్చని అమ్మ ఒడిలో ఆడే పసివాడు పెరిగి పెద్దై నాన్న

సాయంతో ప్రపంచాన్ని చూస్తాడు .

# బడిలో అడుగిడి , శాస్త్రాలెన్నో చదివి స్వతంత్ర

భావాలను అలవర్చుకుని మనిషంటే వీడు అనిపిస్తాడు .

# భగవద్గీతలో చెప్పినట్లు , ఆ దేవదేవుని పూజిస్తూ వాని

కృపకు పాత్రుడవుతాడు .

# నిత్యకృషీవలుడు తన ఉన్నతిని కోరి , ఆ దిశగా

ప్రయత్నించి , సాధించి విజయుడవుతాడు .

# జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించుటకు ఊహలకు రెక్కలు

కట్టి , ప్రేమ మార్గాన్ని ఎంచి మనసెరిగిన మగువ

చేయందుకుంటాడు .

# సృష్టి రహస్యాన్ని ఛేదించి , నూతన తరానికి

హృదయపూర్వక ఆహ్వానాన్ని పలికి , వారి బంగరు

భవిష్యత్తుకు బాటలు వేస్తాడు .

# నాడు బంటు తానై , సహచరుని రాజుగా చూసి

దొడ్డమనసును చాటాడు .

# నేడు ప్రజాస్వామ్యంలో సమానత్వంతో స్వేచ్ఛను

పొందుతున్నాడు .

# అన్వేషణలో అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్నాడు .

# జైత్రయాత్రను సంతృప్తితో సాగిస్తూ ఆదర్శంగా

నిలుస్తాడు .



Rate this content
Log in

Similar telugu poem from Inspirational