మళ్లీ స్కూలుకు..
మళ్లీ స్కూలుకు..
అదే బాగుండేది
పొద్దున్నే స్కూలుకు
సాయంత్రం పార్కుకు
ఎంచక్కా బంటీతో ఆడుకొని
కుంచెం బలపాలు విరగ్గొట్టి
జారుడు బండకు పనిచెప్పొచ్చు
ఇప్పుడు అంతా మారింది
కరోనా అని ఒకటి వచ్చిందట
అంటే బూచి అన్నమాట
ఇదేదో నిజం బూచే
స్కూలుకు సెలవలు ఇచ్చినట్టే ఇచ్చి
ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు పెట్టేశారు
స్కూల్లో కొద్ది సేపే
ఇంట్లో రోజూ పరీక్షే
నాన్నేమో (a+b)^2 అంటాడు
అమ్మేమో వ్యాకరణం అడుగుతుంది
మళ్లీ స్కూలు తెరిస్తే బావుణ్ణు
అమ్మో
ఇక పుస్తకాల బరువు ఎంత పెరుగుతుందో
ఇంక లీజర్ పీరియడ్స్ అస్సలు ఉండవు కాబోలు..
