STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

మహిళా నీ చైతన్య తత్త్వం #- KAWEESHWAR

మహిళా నీ చైతన్య తత్త్వం #- KAWEESHWAR

1 min
225

అంశం : మహిళా సాధికారత

శీర్షిక : మహిళా నీ చైతన్య తత్త్వం #

పేరు : జయంత్ కుమార్ కవీశ్వర్

ఊరు : రాజేంద్రనగర్ , హైదరాబాద్ .

08.03.2023. 

చరవాణి : 970367 3692

*************

పురాణ వనితల ఆదర్శమే మార్గదర్శనం 

పతివ్రతాశిరోమణుల అనుసరణీయ సరళి 

సకల రంగాల ధీరోద్ధాతత్తవృత్తి, ప్రవృత్తుల 

జీవనసత్యాలకారణహేతువులే మీరుమహిళలు 


వీరోచిత పోరాట పటిమల రుద్రమ,లక్ష్మీబాయి,

వేద పురాణ,ఇతిహాసాల అరుంధతి అనుసూయలు

విశ్వాంతరాళ వ్యోమగామినులు కల్పనా,వాలెంటినాలు 

దేశాలను పరిపాలించిన తరుణులు ఇందిరా గాంధీ ,సిరిమావోలు


క్రీడారంగాన అంగనామనులైన సింధు, సైనా - స్మృతులు 

చలనచిత్ర రంగాన గాయనీ మణులు లతా , జానకి -సుశీలలు

ఈ రంగాన నటీరత్నాలైన హేమ ,భానుమతి ,అంజలీ - రేఖలు

సంగీత గాత్ర సరస్వతి ప్రతి రూపాలైన సుబ్బులక్ష్మి,పట్టమ్మాళ్లు .


దేశ తలమాణిక్యాలైన వీరందరి జీవన తత్వాలు,

అవగాహనతో అనుసరణీయం- భావి తరాలకు బంగారు బాటలు వేసిన

ఈ అంగనామనులు రాబోయే తరాలకు ఆదర్శం - మార్గదర్శనం

ధైర్యం తో ఎలాంటి పరిస్థితులను ఎదురించైనా తమ లక్ష్యాలను చేరాలి 

" అంతర్జాతియ మహిళా దినోత్సవ శుభ సందర్భం లో:

నా మన: పూర్వక శుభాభినందనలతో : # కవీశ్వర్ .

*************


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract