మధ్యతరగతి జీవితం
మధ్యతరగతి జీవితం
చెదిరిన కలలు ,
ఆవిరైన ఆశలు
వీడని కష్టాలు ,
భరించలేని బాధలు
భారమైన బాధ్యతలు ,
వెక్కిరిస్తున్న సమస్యలు
పెరగని ఆదాయాలు ,
తరగని అప్పులు
కొండెక్కిన నిత్యవసర ధరలు
పెనుబారమైన రోజువారి ఖర్చులు
విపత్కర పరిస్థితులు ,
క్లిష్టమైన సవాళ్లు, వీటన్నింటి
మధ్య అనుక్షణం నలిగిపోతూ ,
ప్రతిక్షణం, చస్తూ బ్రతుకుతూ తనను
విశ్వసించిన వారి కోసమై
తను ఒంటెద్దు బండిలా మారి
ఈ జీవితమనే బతుకు బండిని
లాక్కెళ్ళుతు , బ్రతుకుకై
బతుకుతో పోరుచేసె ప్రతి
మధ్యతరగతి జీవితం కష్టతరమే!
ఆ కష్టాన్ని మాటల్లో చేతిరాతల్లో
వర్ణించడం సులభమే కానీ...!
ఆ స్థానంలో ఉండి ఆ కష్టాన్ని
అనుభవిస్తే తప్ప ఆ బాధేంటో ,
ఆ కష్టమేంటో ఎవరికి అర్థమవ్వదు!
